ఇకపై ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఆంక్షలు

సందర్శకుల కోసం ట్యాంక్‌బండ్‌పై ఇక ప్రతి ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు తీసుకురావాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టాలని పోలీస్‌ కమిషనర్‌కు కేటీఆర్‌ సూచించారు. మంత్రి కేటీఆర్‌ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎవరైనా సహాయం కోరితే వెంటనే స్పందిస్తారు. తాజాగా ట్విట్టర్‌లో ఓ నెటిజన్‌ చేసిన విజ్ఞప్తికి కేటీఆర్‌ స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ట్యాంక్‌బండ్‌ అందాలను ఆస్వాదించడానికి అనుకూలంగా ఉండేలా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. అయితే దీనిపై సీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.