క‌రోనా విఘ్నం ప్రజల నుంచి తొలిగిపోవాలి : మంత్రి పేర్ని నాని

 Minister Perni Nani Vinayaka Chavithi Wishes to people

శుక్రవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఏ కార్యం తలపెట్టినా తొలి పూజ…ఆరాధన విఘ్నేశ్వరునికే చేస్తామ‌ని అన్ని విఘ్నలు తొలగి సకల కార్యాలు రాష్ట్ర ప్రజలకు సిద్దించాలని ఆ గణనాథుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్ర‌తి కుటుంబం మట్టి గణపతి ప్రతిమల‌ను ప్రతిష్ఠించుకోని కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఇంటిల్లిపాది వేడుకగా పూజించుకోవాల‌ని మంత్రి పేర్ని నాని సూచించారు.

ప్రకృతిని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ వినాయక చవితి అని, మట్టి గణపతినే పూజించాలని తద్వారా మన పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఆ గణనాధుడిని ప్రకృతి సిద్దమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజిద్దామన్నారు. ప్లాస్టిక్ పూలు, దండలు వద్దని , నిమజ్జనం సమయంలో చెరువులలో, వాగులను ప్లాస్టిక్ రహితంగా ఉంచుకొని పర్యావరాన్ని సంరక్షించుకుందామని పిలుపునిచ్చారు. మన అందరిపై ఆ విఘ్నేశ్వ‌రుని అనుగ్రహంమెండుగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరుతున్నానన్నారు.

ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా గా జరుపుకోవాలని మంత్రి పేర్ని నాని ఆకాంక్షించారు.