ఏడు గంటల పాటు ముమైత్ ఖాన్ ను విచారించిన ఈడీ

Mumaith Khan Enquiry Completed in Tollywood Drugs Case

 

ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు ఎంతోమంది సెలెబ్రిటీలను టార్గెట్ చేసింది. మొదట్లో మనీ లాండరింగ్ కేసు అంటూ స్టార్ట్ చేసిన అధికారులు అది కాస్త డ్రగ్స్ కేస్ కి టర్న్ అయ్యింది. ఈడీ ఈ కేసును దగ్గరుండి మరీ పరిశీలిస్తుంది. ఈ కేసులో మనీ లాండరింగ్, బ్యాంకు ట్రాన్సాక్షణ్ లో విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్ గా మారడంతో ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ కేసులో పూరీ జగన్నాథ్, చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, హీరో రవితేజ, హీరో నవదీప్ విచారణకు వెళ్ళారు. ఎఫ్ క్లబ్ తో ఎలాంటి డీల్స్ జరిగాయని డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ను ఎంక్వయిరీ చేస్తున్నారు.

ఈ క్రమంలో లేటెస్ట్ గా ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దాదాపు ఏడు గంటల పాటు ముమైత్ ను ఎంక్వయిరీ చేశారు. అలాగే ఎఫ్ క్లబ్ ఈవెంట్స్, ఆమె బ్యాంక్ ట్రాన్సాక్షన్ ల వివరాలతో పాటుగా మరికొన్ని కీ పాయింట్స్ తెలిశాయి. కెల్విన్, జిషాన్ లతో ముమైత్ కు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నాయనేది ఈడీ అధికారుల అనుమానం. ముమైత్ ను మళ్ళీ విచారణకు పిలుస్తామని అనడం గమనార్హం.