బంగార్రాజు నాగలక్ష్మీ లుక్ పై హైప్ క్రియేట్ చేసిన నాగచైతన్య..

Naga Chaitanya created hype on Bangarraju Nagalakshmi look

 

టాలీవుడ్ మన్మదుడు నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా బంగార్రాజు. నాగచైతన్యతో కలిసి నటిస్తున్న ఈ సినిమాను నాగార్జున ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తుంది. సినిమాలో కృతి పాత్ర పేరు నాగలక్ష్మీ. ఆమె పాత్రకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను రివీల్ చేసారు. నాగచైతన్య సోషల్ మీడియా అకౌంట్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫేస్ కనిపించకుండా నమస్కారం చేస్తున్నట్లుగా కృతి చేతులను చూపించారు.

బంగార్రాజు నాగలక్ష్మీని నవంబర్ 18 న ఉదయం 10 గంటల 18 నిమిషాలకు రిలీజ్ చేస్తామని పోస్టర్ పై పేర్కోన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె లుక్ కోసం ఎంతోమంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి సమర్పిస్తున్నారు.

ఈ సినిమాను సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో చలపతిరావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తో పాటు బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ లు కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.