బంగార్రాజు సినిమాని కూడా సంక్రాంతి బరిలో నిలబెట్టనున్నారా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో 2022 సంక్రాంతి చాలా స్పెషల్ గా నిలవబోతుంది. ఈ సంక్రాంతికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల భారీ ప్రాజెక్టుల రిలీజ్ డేట్స్ రెడీగా ఉన్నాయి. అఫిషియల్ అనౌన్స్ చేయకపోయినా జనవరి 12 కు చిరంజీవి ఆచార్య సినిమా కూడా రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా నాగార్జున నెక్ట్స్ సినిమా బంగార్రాజును కూడా వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని అనుకుంటున్నారట. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్నారు బంగార్రాజు సినిమా.

ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలో పోషిస్తుండగా, నాగచైతన్య, కృతి శెట్టి లు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మేరకు జీ టీవీతో ఒప్పందంలో క్లారిటీగా ఓ క్లాజ్ ఉందని తెలుస్తుంది. దాదాపు 47 కోట్ల రూపాయలకు ఫస్ట్ కాపీని జీ టీవీకి అందించాలని నాగార్జున అక్కినేని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట. అలాగే సినిమా ప్రొడక్షన్ బాధ్యత కూడా నాగార్జుననే తీసుకున్నారట. అందుకే ఈ సినిమాని కూడా 2022 సంక్రాంతి టైమ్ కల్లా ప్రేక్షకులకు అందించాలని అనుకుంటున్నారట. అయితే భారీ సినిమాల మధ్య నాగార్జున కూడా యాడ్ అవ్వడం సంతోషకరమే అయినా.. ఎవరికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.