నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Nandamuri Balakrishna 'Akhanda' movie release date

 

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్షర్ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా అఖండ. ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని ప్రజంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో లేటెస్ట్ గా ఫిల్మ్ టీమ్ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 2 న అఖండ సినిమాను రిలీజ్ చేయాలని ఖరారు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా పోస్టర్ ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని భారీగా ప్లాన్ చేశారు బోయపాటి శ్రీను. పైగా బోయపాటి అంటేనే మాస్ కమర్షియల్ యాక్షన్ డైరెక్టర్ గా ప్లాన్ చేశారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించాయి. అలాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా కూడా హ్యాట్రిక్ ని సాధిస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ ఎస్ అందిస్తున్నారు. ఈ సినిమాపై ఫస్ట్ నుండి బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి.