నాని 28వ‌ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్

కరోనా కాలంలోనూ నాచురల్ స్టార్ నాని తెగ స్పీడ్ మీదున్నాడు. వరుసపెట్టి మూవీలకు సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలని క్యూలో పెట్టుకున్న నాని.. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని 28వ చిత్రంగా వస్తున్న దీనికి ‌అంటే సుంద‌రానికి అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఇందుకు సంబంధించిన క‌ర్ట‌న్ రైజ‌ర్‌‌ను రిలీజ్ చేయ‌గా… ఆక‌ట్టుకునేలా ఉంది. ఇందులో నాని లగేజ్‌ బ్యాగ్‌ పట్టుకుని అటు తిరిగి నిలుచున్నాడు. పల్లెటూరి వ్యక్తిగా పంచెకట్టుతో కనిపిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.  మలయాళ నటి నజ్రియా ఫహాద్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.