నాని శర్వాల జోరు మామూలుగా లేదుగా..!

2020 సంవత్సరం టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమలకు కూడా జీరో ఇయర్ గా మిగిలి పోయింది. ప్రతి ఏడాది వందల సినిమాలు వచ్చే ఇండస్ట్రీల్లో మొదటి రెండు నెలలు విడుదల అయిన సినిమాలే. మార్చి నుండి ఇప్పటి వరకు సినిమాలే లేవు. ఏడాది గ్యాప్ రావడంతో కొందరు యంగ్ హీరోలు ఈ గ్యాప్ ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ గ్యాప్ లో వరుసగా సినిమాలకు కమిట్ అయ్యారు. వచ్చే ఏడాది గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేసేందుకు గాను ఈ గ్యాప్ లో సినిమాలకు ఓకే చెప్పారు.

టాలీవుడ్ లో నాని మరియు శర్వానంద్ ల సినిమా ఎంపిక విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. నాని ఇప్పటికే టక్ జగదీష్.. శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అంటే సుందరానికి అనే సినిమాను కూడా ప్రకటించాడు. ఈ మూడు సినిమాలు కాకుండా వచ్చే ఏడాది మరో రెండు సినిమాలు కూడా నాని చేసే అవకాశం ఉంది. ఇక శర్వానంద్ జోరు కూడా అదే మాదిరిగా ఉంది. ఇప్పటికే ఈయన నటించిన శ్రీకారం విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు ఆడాళ్లు మీకు జోహార్లు మరియు మహా సముద్రం సినిమాలతో పాటు టైటిల్ ఖరారు అవ్వని మరో సినిమాను చేస్తున్నాడు.

నాలుగు సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉండగా మరో రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది. శర్వా జోరు చూస్తుంటే వచ్చే ఏడాది కనీసం నాలుగు సినిమాలు అయినా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. నాని మరియు శర్వాల స్థాయిలో కాకున్నా ఇతర హీరోలు కూడా వచ్చే ఏడాది వరుసగా సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.