న్యాచుర‌ల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ మూవీ షూటింగ్ స్టార్ట్

Nani Shyam Singha Roy starts shooting
Nani Shyam Singha Roy starts shooting

రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న న్యాచుర‌ల్ స్టార్ నాని నెక్ట్స్ మూవీ శ్యామ్ సింగ రాయ్. ఈ చిత్రం షూటింగ్ క‌ల‌క‌త్తాలో అట్ట‌హ‌సంగా స్టార్ట్ అయ్యింది. ఇక నుండి శ‌ర‌వేగంగా, లాంగ్ షెడ్యూల్ తో ఈ మూవీ షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫ‌స్ట్ డే నుండే నాని షూటింగుకు హాజరువుతున్నారు … ఈ చిత్రంలో నానితో ముగ్గురు ముద్దుగుమ్మ‌లు సాయి ప‌ల్ల‌వి, క్రితీ శెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్ లు ఆడిపాడ‌నున్నారు. ఈ సినిమాకి జంగ స‌త్య‌దేవ్ క‌థ‌ను అందించారు. మిక్కిజే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్… ఇక నుండి రెగ్యూల‌ర్ గా మూవీ అప్డేట్స్ అందివ్వ‌నుంది.