ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వనున్న నాని.. టక్ జగదీష్ ట్రైలర్..

Tuck Jagadish
Tuck Jagadish

ప్రజంట్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ నాని కూడా టాప్ మోస్ట్ హీరోనే. అష్టాచెమ్మా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక ప్రజంట్ నాని సినిమాల లిస్ట్ ఎక్కువగానే ఉంది. లేటెస్ట్ గా టక్ జగదీష్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. కరోనా కారణంగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని నాని తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్విట్వర్ లో పోస్ట్ చేసారు. నెక్ట్స్ 24 గంటల్లో మీకు కావాల్సిన, అలరించాల్సిన ట్రైలర్ ని రిలీజ్ చేస్తానని నాని అన్నారు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 10 న ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, సుందరానికి.. లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోకపోవడం వల్ల నాని సినిమా సభ్యలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయంపైన సినీ ఎగ్జిబిటర్లకు, టక్ జగదీష్ సినిమా టీమ్ కు మినీ వార్ జరిగింది. ఈ క్రమంలో నాని సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు. అలాగే మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు అందుకే మీకో సర్ ప్రైజ్ అంటూ నాని తన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ ని పోస్ట్ చేశారు. సో ఫైనల్ గా నాని ఫ్యాన్స్ కి ట్రైలర్ ని గిఫ్ట్ గా ఇవ్వనున్నారు.