టక్ జగదీష్ పై వ్యక్తమవుతున్న నెగిటివ్ ప్రచారం

నేచురల్ స్టార్ నాని కరోనా ముందు వరకు మంచి హిట్స్ ని సొంతం చేసుకుంటూ.. తన కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని యూత్ లో కలిగిలే చేశారు. కరోనా కారణంగా ప్రముఖ ఓటీటీలో వి సినిమా రిలీజైంది. అయితే ఈ సినిమా ఆశించనంత స్థాయిలో క్లిక్ అవ్వలేదు. లేటెస్ట్ గా యాక్ట్ చేసిన టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్లు ఫిల్మ్ టీమ్ తెలిపింది. థియేటర్లలో రిలీజ్ చేయాలని నానితో పాటు ఫిల్మ్ టీమ్ కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ పలు కారణాల వల్ల తమ నిర్ణయాన్ని మార్చుకుని ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయంలో సినీ వర్గాలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టక్ జగదీష్ ను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉంటే.. ఈ నిర్ణయం సరైంది కాదని నెటిజన్లు అంటున్నారు.

ఇలా వరుసగా నాని సినిమాలు ఓటీటీలో రిలీజైతే అతనికి ఉన్న క్రేజ్ తో పాటు సినిమా మర్కెట్ కూడా తగ్గిపోతుందని అంటున్నారు. మరికొంతమంది అయితే టక్ జగదీష్ సినిమా హిట్ సాధించలేదనే అపనమ్మకంతోనే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కి స్పందించాలని నాని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టక్ జగదీష్ సినిమాకు పొరపాటున నెగిటివ్ టాక్ వస్తే ఇక నాని భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. టక్ జగదీష్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలకు నాని చెక్ పెడతారో లేదో చూడాలి.