భారత్ కు అసలు వ్యాక్సిన్ అవసరమా .. హర్భజన్ ట్విట్ పై నెటిజన్స్ ఫైర్

కరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. భారత్ తో పాటు రష్యా చైనా అమెరికా బ్రిటన్ లాంటి దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి చివరి దశలో ఉన్నాయి. అమెరికాలో అయితే ఫైజర్ వ్యాక్సిన్మరికొద్ది రోజుల్లోనే మార్కెట్ లోకి రాబోతుంది. మన దేశంలో కూడా మరో మూడు నాలుగు నెలల్లో వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఒక విధంగా చూస్తే … భారత్ లో వృద్దులు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే ఈ మహమ్మారి దెబ్బకి బలైపోతున్నారు.

ఇక భారత్ లో కరోనా మహమ్మారి నుంచి కోరుకున్న వారి సంఖ్య దాదాపు 93.6 శాతంగా ఉంది. దీనిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ ఈరోజు ఉదయం ఓ ట్వీట్ చేశాడు. ఫైజర్ వ్యాక్సిన్ 94 శాతం ఆక్స్ ఫర్డ్ 90 శాతం మోడెర్నా 94.5 శాతం సమర్థవంతం అని ప్రకటించుకున్నాయి. భారత్ లో ఏ వ్యాక్సిన్ లేకుండానే 93.6 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు చెప్పండి.. భారత్ కు అసలు వ్యాక్సిన్ అవసరమా ‘ అని ట్వీట్ చేశాడు. ఈ ట్విస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడం తో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్భజన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇలాంటి పిచ్చి పోస్ట్ లు చేయకు అని ఒకరు భజ్జీపై మండిపడగా.. కాస్త లాజిక్ తో ఆలోచించు’ అని మరొకరు సూచించారు. నీ లాజిక్ చూస్తే.. శాస్త్రవేత్తలు ఏడుస్తారు నీకు కరోనా వస్తే తెలుస్తది అని మరికొందరు హర్భజన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల మందిలో 6.4 శాతం మంది అంటే ఎంతో తెలుసా.. అంత మంది పోతేపోనీ అని అనుకుంటున్నావా అని ఓ యూజర్ హర్భజన్ ను నిలదీశాడు. ఓ స్పిన్నర్ బౌలింగ్ చేస్తుంటే ప్యాడ్స్ ఎందుకు.. బాల్ తగిలినా తట్టుకునేంత బలమైన ఎముకలు ఉన్నాయి కదా అని మరొక యూజర్ భజ్జి పై సెటైర్ వేశాడు. మొత్తంగా భజ్జి చేసిన ఓ ట్విట్ ఇప్పుడు నెటిజన్స్ కి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది.