ఎక్స్‌ప్రెస్‌ స్పీడ్ లో నితిన్ గడ్కరీ !!!

Nitin Gadkari on Express Speed

 

ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రతి నెలా 1,500 కోట్ల రూపాయల టోల్ ఆదాయాన్ని పొందుతుందని, కొత్త ఎక్స్‌ప్రెస్‌వేను “బంగారు గని” గా అభివర్ణించారు కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే 1,350 కి.మీ తో కూడుకొని, 8-లైన్ల వెడల్పుతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశ జాతీయ రాజధాని న్యూఢిల్లీని దాని ఆర్థిక రాజధాని ముంబైతో కలుపుతుంది. ఇది వినియోగదారులకు హై-స్పీడ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది మరియు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వేగా అవతరించనుంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని మరియు కాలుష్య స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని గడ్కరీ చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వే ఐదు రాష్ట్రాల మారుమూల ప్రాంతాల గుండా వెళుతుందని, ఆయా ప్రాంతాలకు అభివృద్ధి రెక్కలు ఇస్తుందని ఆయన అన్నారు.

ఎక్స్‌ప్రెస్‌వేలో ఎనిమిది లేన్‌లు ఉంటాయి మరియు మున్ముందు ఇది మొత్తం పన్నెండు లేన్‌లకు విస్తరించవచ్చు, ఇది ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర వంటి మొత్తం 6 రాష్ట్రాల గుండా వెళుతుంది.

కేంద్ర మంత్రి ఎలక్ట్రిక్ హైవే అనే ఆలోచనను కూడా ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ ట్రక్కులు మరియు బస్సులు గంటకు 120 కిమీ వేగంతో ప్రయాణించగలవు, ఇంధనం ఆదా అవుతుంది మరియు లాజిస్టిక్స్ ధరలను మరింత తగ్గించవచ్చు.

NHAI అప్పుల ఊబిలో లేదని భవిష్యత్తులో కూడా అది ఎన్నటికీ అప్పుల ఊబిలో ఉండదని కూడా ఆయన ధృవీకరించారు. వచ్చే ఐదేళ్లలో, NHAI టోల్ ఆదాయం ప్రస్తుత టోల్ ఆదాయం 40,000 కోట్ల నుండి 1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని తెలిపారు.
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మార్చి 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.