వలపువల విసురుతాడు,నమ్మించి గొంతుకోస్తాడు … డేంజరస్‌ ” కాషాయ కామాంధుడు “

Not a Young Leader, Man with Criminal Mind

 

  •  డబ్బున్న మహిళలే టార్గెట్
  • స్త్రీ అంటే వీడికి ఒక సెక్స్ టూల్

  • మాయమాటల్లో వీడు మాస్టర్ మైండ్

  • లక్షలు మింగేయటం, బంగారం కాజేయటమే లక్ష్యం

  • బాధితులు ఎదురుతిరిగితే కులం కార్డు ప్రయోగం

  • దళితుడిని,అట్రాసిటీ కేసు పెడతానంటూ స్కెచ్

  • దుర్మార్గానికి వెన్నుదన్నుగా నిలిచిన “విలేఖరులు” ఎవరు?

  • కాషాయ కామాంధుడికి డెన్‌ గా మారిన ఆ బార్‌ ఎవరిది?

ఇస్త్రీ నలగని చొక్కా, నుదుట అడ్డబొట్టు, అరివీర భక్తుడి లెవల్లో చేతికి కాషాయదారం…అయినా సరిపోలేదన్నట్లు కడియం ఒకటి. ఇవి మాత్రమేనా “అయ్యగారి” గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంది. తొలిసారిగా చూసిన వారు ఎవరైనా సరే… “సార్” చాలా పలుకుబడి ఉన్న నేత కాబోలు అందుకే ఇంత హంగామా అనుకుంటారు. ఇక ఆ “అయ్యగారి” మాటలు వింటే నో డౌట్ బాస్… ప్రధాని నుంచి సీఎం వరకు హైలెవల్ పరిచయాలు ఉన్నాయనుకుని బుట్టలో పడిపోతారు. కానీ కొంతకాలానికి తెలుస్తుంది తాము పడిపోయింది బుట్టలో కాదు పెంట కుప్పలో అని. తనకు తాను ” దేశ్‌ కీ నేత “గా బ్రాండింగ్ చేసుకునే ఇతగాడు పక్కా 420. రైల్వే స్టేషన్‌లో పట్టుబడిన మద్యం బాటిళ్లను విడిపించడం నుంచి ఒక బార్‌ను డెన్‌గా మార్చుకుని తన చీకటి కార్యకలాపాలు నిర్వహించే వరకు ఇతగాడి లీలలు అత్యంత జుగుప్సాకరం మరి.

#కామా తురాణం..నభయం నలజ్జ!

అఖండభారత్‌ను నిర్మిస్తామని ప్రకటించుకున్న ఒక రాజకీయ పార్టీలో ఇతగాడు ఒక నేత. శత్రువుల నుంచి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆ పొలిటికల్ పార్టీ చాటింపు వేసుకుంటుంటే…ఈ 420 మాత్రం కంటికి రెప్పగా నిలుస్తానంటూ కామంతో అల్లిన వలలు విసురుతున్నాడు. ఒంటరిగా బతుకుతున్న వారి నుంచి వీడి కన్ను పడిన మహిళల వరకు మాయమాటలతో లోబర్చుకుంటున్నాడు. ఇందుకు…మీరు చదవబోయే యదార్ధగాధ సాక్ష్యం. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జాహ్నవి చౌదరి ( పేరు మార్చాము )కి కొన్నేళ్ల క్రితం వేరొకరితో వివాహం జరిగింది. మనస్పర్ధలు రావటంతో విడిపోయి తన కూతురితో కలిసి జీవిస్తోంది. ఆర్ధికంగా ఉన్న కుటుంబమే అయినప్పటికి ఆత్మగౌరవంతో బతకాలని నిశ్చయించుకుంది. సూటిపోటి మాటలతో సమాజం వేధిస్తున్నా, అనుమానపు, అవమానపు చూపులు వెంటాడుతున్నా సరే…తన బిడ్డకోసం చిరునవ్వుతో అన్నింటిని భరిస్తోంది. విధికి కన్నుకుట్టిందో ఏమో కానీ ఈ “కాషాయ కామాంధుడి” చూపు జాహ్నవిచౌదరి పై పడింది. తన క్రిమినల్‌ బ్రెయిన్‌ను వాడి ఫోన్‌ నెంబర్‌ సంపాదించాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. స్నేహం నటించి జాహ్నవికి మరింతగా చేరువయ్యాడు. తన పాచిక పారిందని డిసైడ్ అయిన తర్వాత… మృగోన్మాదాన్ని బయట పెట్టాడు. “జాహ్నవి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వులేకపోతే నేను బతకలేను, నీ కూతురిని నా కూతురుగా చూసుకుంటాను, నేను అమ్మా నాన్న లేని అనాధను, నాకు అంతా నీవే, నువ్వు ఓకే అంటే నీ నీడ విడిచిపెట్టినా సరే నిన్ను వదలను అంటూ నమ్మకం సైతం నమ్మలేనంతగా నమ్మించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ అమాయకురాలు ఒప్పుకుంది. తన జీవితంలోని పీడకలను ఇతగాడి ప్రేమతో తుడిచేసి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, తన కూతురికి భద్రతను ఇవ్వొచ్చని ఎన్నో కలలు కన్నది.

#ఒకరా, ఇద్దరా బాధితులు ఎందరో? కామాంధుడి లీలలు మరెన్నో!

జాహ్నవి చౌదరి బుట్టలో పడిపోయిందని డిసైడ్ అయ్యాక ఆమెను ఖమ్మంలో కొంతకాలం ఉంచాడు. మధిరలో ఎందుకు మనం కలిసి ఉండకూడదని అడిగితే ఇప్పుడే వద్దు, కొన్నాళ్ల తర్వాత ఉందాం అంటూ కవర్ చేసాడు. జాహ్నవి చౌదరికి “పెళ్లి ప్రమాణం” చేసిన ఆ కాషాయ కామాంధుడు ముందుగా శారీరకంగా లోబర్చుకున్నాడు. అవసరాలకు అందినంత గుంజాడు. పెళ్లి మాటెత్తితే మాత్రం….తప్పించుకునేందుకు ట్రై చేసేవాడు. ఒకరోజు గట్టిగా నిలదీసింది, ఇక చేసేది లేక ఆ ఇంట్లోనే మూడుముళ్లు వేసాడు తప్పితే….అధికారికంగా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఎందుకో తెలుసా … ఈ 420 స్కెచ్ వేరే ఉంది. ఖమ్మం నుంచి మధిరకు షిఫ్ట్ అయ్యాక జాహ్నవిని ఊరు మొత్తానికి నా భార్య అంటూ పరిచయం చేసాడు. ఇది చూసి ఆ అమాయకురాలు పొంగిపోయింది. ఇదంతా నిజమేననుకుని ఊహాలోకంలో విహరించింది. కానీ ఓ భయంకర వాస్తవం జాహ్నవికి అంతా తెలిసిపోయేలా చేసింది. తనతో ప్రయాణం ప్రారంభించటానికన్నా ముందే ఆ 420కి పెళ్లి అయిందనే నిజం బట్టబయలైంది. ఒక్కసారిగా జాహ్నవి కాళ్ల కింద భూమి కంపించింది. కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నమ్మకం నడివీధిలో నిల్చుకున్నందుకు కుమిలిపోయింది. ఆ కాషాయ కామాంధుడి నమ్మక ద్రోహం తెలుసుకున్నాక కూతురితో సహా ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయింది. కానీ ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. తన గుట్టు జాహ్నవి చేతికి చిక్కిందని గ్రహించక..ఎప్పటిలాగే దర్జాగా వచ్చాడు. “నన్నెందుకు ఇంత దారుణంగా మోసం చేసావు? నన్నెందుకు ఇంతలా వాడుకున్నావు? అంటూ నిలదీసింది. గుండెలు పగిలేలా రోదించింది. ఒక్కసారిగా బిక్కచచ్చిపోయిన ఆ “కాషాయకామాంధుడు” వెంటనే ఆ డర్టీ మైండ్‌కు పదును పెట్టాడు. అవును..నేను నిన్ను మోసం చేసాను, నాకు పెళ్లి కాలేదని అబద్దం చెప్పాను, నాకు ఒక కొడుకు ఉన్నాడనే నిజం కూడా దాచాను..ఎందుకో తెలుసా నువ్వంటే నాకు ప్రాణం జాహ్నవి, నిన్ను దూరం చేసుకుని బతకలేను కనుకే… ఈ నిజం దాచాను. నాకు చావైనా,బతుకైనా నీతోనే, నువ్వెందుకు చావాలి? చస్తే ఇద్దరం కలిసి చనిపోదాం. నాకు నా భార్య అంటే అసలు ఇష్టం లేదు. తన క్యారెక్టర్ మంచిది కాదు అని అపరిచితుడు సినిమాలో విక్రమ్‌ను మించిపోయి, ఆస్కార్‌ అవార్డ్ సైతం జయహో అనే రీతిలో నటించాడట ఆ 420.

#వీడు మనిషి కాదు… ముసుగేసుకున్న మానవమృగం!

అప్పటికే జాహ్నవి చౌదరి నుంచి దాదాపు 5లక్షల రూపాయలు మింగేసాడు. పార్టీ మీటింగులు ఉన్నాయి, జనాన్ని సమీకరించాలంటూ కాజేసాడు. వీటన్నింటికి మించి జీవితంతో ఆడుకున్నాడు. అప్పటికే భార్య, కొడుకు ఉండగానే జాహ్నవిని మాయలో ముంచాడు. ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుంగిపోయింది. ఇంతలోనే మరొక కీచక ప్రపోజల్ పెట్టాడీ 420. అందరం కలిసే ఉందాం, కలిసే బతుకుదాం అంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేసాడు. జాహ్నవి ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతానంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసాడు. అప్పటికే చచ్చిపోయిన మనసును మరింతగా చంపేసుకుని మరి రెండుసార్లు కలిసే ప్రయత్నం చేసింది జాహ్నవి. నా ప్రాణ స్నేహితురాలు అంటూ ముందు దగ్గర చేస్తాను, ఆపై నిజం చెప్పేస్తాను అనే ఆ కీచకుడి ప్రపోజల్‌కు సైతం గత్యంతరం లేని పరిస్ధితుల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ 420 వేసిన పాచిక పారలేదు సరికదా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. దీంతో రెండిళ్ల పూజారి అవతారమెత్తాడీ ” కాషాయ కామాంధుడు “. ఆ ఇద్దరు మహిళలు నిలదీసినప్పుడల్లా మానసికంగా, శారీరకంగా చెప్పుకోలేని చిత్రహింసలు పెడుతూ, అనుమానంతో వేధిస్తూ….మధిరలో మాత్రం పెద్దమనిషిగా చెలామణీ అవుతున్నాడు. దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది. అలాగే జాహ్నవి సహనం కూడా లైన్‌ ఆఫ్ కంట్రోల్‌ను దాటేసింది. ఎందుకంటే ఈ కీచక కాషాయ కామాంధుడి ఖాతాలో అతడి భార్య, తను మాత్రమే కాదు మరొక ఇద్దరు ఉన్నారని తెలుసుకుంది. వాగ్ధేవి ( పేరు మార్చాము )అనే టైలర్‌ను కూడా ట్రాప్ చేసాడని, ఆమె వద్ద నుంచి లక్షల్లో గుంజాడనే వాస్తవం తెలుసుకుంది జాహ్నవి. కొంతకాలం క్రితం ఆమె టైలరింగ్ చేసే షాప్ వద్దకు వెళ్లి కుట్టు మెషీన్‌ను ధ్వంసం చేయటమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడని..దీంతో తీవ్ర మనస్ధాపానికి గురైన వాగ్ధేవి ఆ కీచకుడి బారి నుంచి తప్పించుకుందనే సత్యాన్ని తెలుసుకుంది. వాగ్ధేవి వివరాలు కనుక్కున్న జాహ్నవి ఆమెను కలుసుకుంది. ఆ కీచకపర్వాన్ని పూస గుచ్చినట్లు చెప్పిన వాగ్ధేవి బాధను తన గుండెల్లో దాచుకుని ఇంటికి వచ్చింది. మళ్లీ నిలదీస్తే…ఆ 420 వేసిన డ్రామా, చేసిన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ వివరించేందుకు అక్షరాలు సరిపోవు!

#ఆ “బార్‌&రెస్టారెంట్ ” ఈ కాషాయ కామాంధుడి అడ్డా!

ఇక ఏది అయితే అది అనుకున్న జాహ్నవి చౌదరి ఈ కీచక కాషాయ కామాంధుడిని నిలదీసింది. నా జీవితాన్ని నాశనం చేసింది చాలు, నన్ను ఆర్ధికంగా, శారీరకంగా చితికిపోయేలా చేసింది చాలు, నా భవిష్యత్తును, నా కూతురిని జీవితాన్ని నాశనం చేయ్యకు ఇక నీ జోలికి రాను.. నాకు ఇవ్వాల్సిన డబ్బు,బంగారం ఇచ్చెయ్యి అంటూ కాళ్ల వేళ్లా పడి బతిమిలాడుకుంది. ఇక కులం కార్డ్ బయటకు తీసాడు. నేను, నా భార్య కలిసి నీ మీద అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరించాడీ 420. ఈ కీచక కామాంధుడి భార్య కూడా జాహ్నవికి కాల్ చేసి.. ఆయనకు ఏమైనా అయితే నీ అంతు చూస్తామంటూ బెదిరించింది. దీంతో ఆ “దేశ్‌ కీ నేతా” ఏదైనా సూసైడ్ డ్రామా ఆడతాడేమో అనే భయంతో ఆరా తీస్తే… అయ్యగారు మధిరలోని కృష్ణా బార్ అండ్ రెస్టారెంట్ లో తన గ్యాంగ్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడని తెలిసింది. ఒకటికి రెండు సార్లు కన్‌ఫామ్ చేసుకున్నాక…సెప్టెంబర్ 25,2021 శనివారం రాత్రి ఆ బార్‌ వద్దకు వెళ్లింది. జాహ్నవి వచ్చిందనే విషయం తెలుసుకున్నాక కంగారుపడిపోయిన కీచక కామాంధుడు, ఆమెను పైకి రానివ్వకుండానే ఆపేసాడు. ఈ కాషాయ కామాంధుడే కిందకు వచ్చి జాహ్నవితో వాగ్వాదానికి దిగాడు. ఈ ఎపిసోడ్‌ అంతటిని TRSకు చెందిన ఒక యువనాయకుడు గమనిస్తున్నాడనే విషయం గమనించిన “420” ఇంకేముంది.. ఎవరు చూడకూడదనుకున్నానో, ఎవరికి తెలియకూడదనుకున్నానో వారికే తెలిసిపోయింది.. ఇక నేను ఒక్క క్షణం కూడా బతకను అంటూ తన మొబైల్‌ను జాహ్నవి మీదకు విసిరేసి మొసలి కన్నీరు కార్చుకుంటూ వెళ్లిపోయాడు. ఈ హైడ్రామా అంతా జరిగింది కృష్ణా బార్ అండ్ రెస్టారెంట్ వద్దే… ఆ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తే అంతా తెలిసిపోతుంది. ( ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఈ బార్‌ అండ్ రెస్టారెంట్ యాజమాన్య వివాదాస్పద వైఖరి ఎన్నో సార్లు వార్తల్లోకి ఎక్కింది కూడా. ఇదే బార్‌ అండ్ రెస్టారెంట్ కొంతకాలంగా అనేక అరాచకాలకు అడ్డాగా మారిందనేది మధిర ప్రజలకు తెలిసిన విషయమే, ఇందుకు తిరుగులేని సాక్ష్యాలతో,త్వరలో మరో కథనం మీ ముందుకు తీసుకువస్తాం)

#ఆరోపణలు కాదు…నివ్వెరపోయే సాక్ష్యాలు కావాలిగా?

అవును నిజమే…గాలివాటు ఆరోపణలు, గలీజ్ ప్రచారాలు, కులముద్రలు, పోసుకోలు కబుర్లు, నీచపు రాతలు, పసలేని వాదనలు ఇప్పటి వరకు జర్నో టీమ్‌ చేయలేదు, రాయలేదు. రానున్న రోజుల్లో చేయదు,రాయదు కూడా. వాంతులను ఒంటికి పూసుకుని ఊరేగుతూ ఆ కంపును మస్తిష్కాల్లోకి బలవంతంగా కూరేందుకు కొందరు సైకోలు అష్ట కష్టాలు పడుతున్నారు. వాట్స్‌ యాప్‌ గ్రూపులతో పాటు ఫేస్ బుక్ పేజ్‌లతో విషప్రచారాలు చేస్తున్నారు. పొట్టకూటి కోసం దేహాన్ని అమ్ముకునే వారిని సైతం వేధించిన ఆ పోలీస్‌కు అండగా నిలబడుతూ కులం రంగు పులిమే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యారు. సో వాట్? వెనకడుగువేసే ప్రసక్తే లేదు. జర్నో టీమ్‌ తిరుగులేని ఆధారాలు, గుక్కతిప్పుకోనివ్వని సాక్ష్యాలు ఉంటేనే వార్తలను అందిస్తుంది. అదే హామీకి కట్టుబడుతూ ఈ “కాషాయ కామాంధుడు” ఎవరు? ఎవరెవరిని నట్టేట ముంచాడు? ఆ కాషాయ కామాంధుడికి వత్తాసు పలికే విలేఖరులు ఎవరు? ఈ కాషాయ కామాంధుడి లీలలు ఆ రాజకీయ పార్టీ పెద్దలకు తెలుసా లేదా? ఒకవేళ తెలిస్తే ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. ఈ 420 బాధితులు ఇంకా ఎవరెవరు ఉన్నారు? మోసపోయినా సరే ఎందుకని ధైర్యం చేయలేకపోతున్నారు? ఇలాంటి మరెన్నో సంచలన సాక్ష్యాలు, ఆ కాషాయ కామాంధుడి లీలలు బాధితురాలి వేదనలోనే వినేందుకు కొన్నిగంటలు వెయిట్ చేయండి. ఆ 420, కాషాయ కామాంధుడి నుంచి బాధితులకు ఎంతటి ప్రాణాపాయం ఉందో తెలుసుకునేందుకు కాల్‌ రికార్డింగ్స్, వీడియో కోసం కొన్ని గంటలు నిరీక్షించండి. కౌంట్ డౌన్ స్టార్ట్స్…By విజయ్ సాధు ( Editor in Chief)