ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ కి సీనియర్ రచయిత స్క్రిప్ట్!

#NTR30 Latest Updates

 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ కమర్షియల్ డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరు. వరుస సినిమాలను కూల్ గా హ్యాండిల్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా కథలు, పాత్రల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. హీరో ఎలివేషన్ విషయంలో కూడా చాలా ప్రత్యేకంగా ఉంటారు. కొరటాల శివ సినిమాలో ఏ పాత్రైనా దానికి సెట్ కాలేదనే ఆలోచన రాదు. చాలా పర్ఫెక్ట్ గా తన సినిమాల్ని డిజైన్ చేసుకుంటారు. ప్రతి సినిమాలో ఆయన మార్క్ కనిపించేలా చేస్తారు.

ఆయన లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లతో ఆచార్య సినిమాను తెరకెక్కించారు, ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయనేది సినీ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ సినిమాలో సీన్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దేందుకు సీనియర్ రచయిత సత్యానంద్ ను కూడా కలిసినట్లు తెలుస్తుంది. శ్రీధర్ సీపాన, వేమా రెడ్డి కలిసి స్ట్రిప్ట్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ ఎన్టీఆర్ కు నచ్చితే షూటింగ్ కి షురూ చేస్తారట. అలాగే కొరటాల శివ తన సినిమాల్లో ఏదొక సోషల్ మెసేజ్ ను చేర్చుతారు. అలాగే ఈ సినిమాతో కూడా ఓ సందేశాన్ని ఇవ్వనున్నారట. ఈ సినిమాలో కీ రోల్ కోసం మమ్ముట్టిని ఖరారు చేస్తారట. హీరోయిన్ గా ఆలియా భట్, రష్మిక మందన్న పేర్లు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా భారీ సక్సెస్ ను అందుకుంది. అలా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.