ఓలా ఎలక్ట్రిక్ జోరు!!!

Ola Electric Scooter News Today

ఓలా విద్యుత్తు స్కూటర్ల విక్రయాలు ప్రారంభించిన తొలి రోజునే రికార్డు స్థాయి అమ్మకాలు సొంతం చేసుకుంది. అమ్మకాలు మొదలుపెట్టిన బుధవారం ఒక్కనాడే రూ.600 కోట్ల విలువైన స్కూటర్లను అమ్మినట్లు సంస్థ వెల్లడించింది. వీటి అమ్మకాలను గురువారం అర్థరాత్రితో ముగిస్తామని ఓలా సహావ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అంటే గారిష్టంగా ప్రతీ సెకంనుకు నాలుగు స్కూటర్ల చొప్పున బుక్ అయ్యినట్టు. ఆశ్చర్యం కలిగించినా ఇదే నిజం భారత్ యువత ఎలక్ట్రిక్ వెహికల్ పై మగ్గు చూపుతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం.సేల్ విలువ ప్రకారం ఇది ఇండియా మొత్తం స్కూటర్ సేల్ కన్నా ఎక్కువని తెలుస్తుంది.

ఓలా స్కూటర్‌ ఎస్‌1, ఎస్ 1 ప్రో వేరియంట్లలో 10 రంగుల్లో అందుబాటులో లభ్యం కానుంది.
ఈ స్కూటర్ల కొనుగోలు ప్రక్రియను ఓలా యాప్‌లోనే పూర్తి చేయవచ్చు. ఇప్పటికే రూ. 499 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకున్న వారికి ప్రాధాన్యం క్రమంలో విక్రయాలు చేస్తున్నారు. అయితే, డిమాండ్‌ నేపథ్యంలో ప్రస్తుతం రూ.20వేలు చెల్లించాలని.. మిగతా మొత్తం డెలివరీ సమయంలో చెల్లిస్తే సరిపోతుందని ఓలా సంస్థ వెల్లడించింది. అక్టోబ‌ర్‌ 22 నుంచి ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల డెలివ‌రీలు ప్రారంభ‌మ‌వుతాయి.