
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించపోతున్న అన్ని సినిమాలలో కన్నా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాపైనే అందరి చూపు ఎక్కువగా ఉంది. అయితే దర్శకుడు క్రిష్ చేస్తున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ డ్రామా సినిమా పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ వల్ల క్రిష్ – పవన్ కళ్యాణ్ కాబినేషన్ సినిమా పై అంచనాలు అమాంతంగా పెరిగిపోయినాయి. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గజదొంగగా నటిస్తున్నాడా.. లేక యోధుడు పాత్ర లో కనిపిస్తాడా అని.. ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా ఈ చిత్రానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ చిత్రం హిస్టారికల్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉండిపోతుంది అని ఒక క్లారిటి వచ్చినాకా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఈ కాలం నాటిది కాదు అని ఇంకొక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం ఫిట్నెస్ లో కూడా చాల మార్పులు చేశాడు అని టాక్. ఈ చిత్రం కోసం హరహర వీరమల్లు అనే టైటిల్ ను చిత్ర యూనిట్ అనుకుంటున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను మార్చి 11న శివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంగీతం ఎమ్.ఎమ్.కీరవాణి అందిస్తున్నాడు.. అయితే ఎమ్.ఎమ్.కీరవాణి మొదటిసారిగా పవన్ కళ్యాణ్ చిత్రంకి మ్యూజిక్ అందిస్తున్నాడు.