పూజా వ్యాఖ్యలతో సస్పెన్స్ కి తెరపడింది

పూజా హెగ్డే టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. తెలుగులో అలా వైకుంఠపురములో, అరవింద సమేత, గద్దల కొండ గణేష్ ఈ అమ్మడికి మంచి పేరును తీసుకువచ్చాయి. ప్రస్తుతం పూజా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తోంది. అయితే సోమవారం జరిగిన అలా వైకుంఠపురంలో రీ యూనియన్ మీటింగ్లో తన తర్వాతి సినిమా చెప్పకనే చెప్పింది పూజా.

పూజా హెగ్డే తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ తో చేయబోతున్నా అంటూ నోరు జారింది. అయితే వెంటనే నెటిజన్లు ఓ క్లారిటీకి వచ్చేశారు. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో చేయబోతున్నారని అందులో పూజానే హీరోయిన్ అని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనేది మొదట నుంచి సస్పెన్స్ గా మారింది. ఇక పూజా వ్యాఖ్యలతో సస్పెన్స్ కి తెరపడింది. ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.