పవర్ స్టార్ బర్త్ డే కి అద్దిరిపోయే అప్డేట్స్..

Pawan Kalyan Birthday Updates

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ కంటే ఇప్పటి సినీ ఇండస్ట్రీ చాలా ట్రెండీగా మారింది. సినిమా హీరోల పుట్టినరోజున ఫ్యాన్స్ చేసే హడావిడితో పాటు దర్శకనిర్మాతలు ఇచ్చే అప్డేట్స్ కూడా మాములుగా ఉండవు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే ఇంకాస్త హడావుడి ఉంటుంది. ఫ్యాన్స్ కి ఓ పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటారు. సెప్టెంబర్ 2 న పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమాల నుండి రెండు సర్ ప్రైజ్ లతో సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమా నుండి ఓ అద్దిరిపోయే సర్ ప్రైజ్ రెడీగా ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తారట.

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. దీంతో పాటు భీమ్లా నాయక్ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తారని అధికారికంగా ఫిల్మ్ టీమ్ ప్రకటించారు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో వస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తుండగా, రానా డానియల్ శేఖర్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల దగ్గర్నుంచి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.