వాలిమై సినిమా నుండి విలన్ కార్తికేయ పవర్ ఫుల్ పోస్టర్

Powerful poster of villain Karthikeyan from Valimai movie

 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు హీరో కార్తికేయ. ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్నారు. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక నటుడు అంటే హీరోయిజం, విలనిజం అంటూ సంకెళ్లు వేసుకోకూడదని అంటారు కార్తికేయ. అందుకే హీరో అనే పాత్రకే కాకుండా విలన్ గా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు.

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమా వాలిమై. ఈ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ విలన్ గా ఉన్న ఫస్ట్ లుక్ ని ఫిల్మ్ టీమ్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ లుక్ లో కార్తికేయ చేతిలో విస్కీ బాటిల్, మరో చేతిలో వాకీ టాకీ పట్టుకుని చాలా స్టైలీష్.. సీరియస్ లుక్ ఉన్నారు. ఈ సినిమాలో అజిత్ పాత్రకు సమానంగా విలన్ గా కార్తికేయ పాత్ర పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు తెలుస్తుంది. వాలిమై సినిమాని జీ స్టూడియోస్ బ్యానర్లపై వస్తుంది. ఈ మూవీతో కార్తికేయ కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.