ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. అద్దరగొట్టే డైలాగ్స్ తో రాధేశ్యామ్ టీజర్

Prabhas Birthday Special Radheshyam Teaser With Superb Dialogues

 

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ గా ఈరోజు రాధేశ్యామ్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి సినిమాపై విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశారు. ఈ సినిమా అప్డేట్ తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. రాధేశ్యామ్ టీజర్ లో ప్రభాస్ వాయిస్ తో వచ్చే డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.

నువ్ ఎవరో నాకు తెలుసు, కానీ ఏది చెప్పను. ప్రేమలో నీ మనసు ఎప్పుడు విరిగిపోతుందో నాకు తెలుసు. కానీ నీకు అది చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు.. కానీ నేను చెప్పను. నా చావు ఎప్పుడు సంభవిస్తుందో కూడా నాకు తెలుసు.. కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు.. కానీ నేను ఏదీ చెప్పను. ఎందుకంటే అది మీ ఊహలకు కూడా అందదు. నా పేరు విక్రమ్ ఆదిత్య. నేను దేవుడిని కాదు. కానీ నేను మీలో ఒకడిని కూడా కాదు అంటూ యంగ్ రెబల్ స్టార్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమాను వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మాస్తున్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రేరణ క్యారెక్టర్ ని పూజా హెగ్దే పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేసింది.