మగధీర, బాహుబలి మల్టీ స్టారర్ ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి తోడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కావడంతో మరింత ఆదాయాన్ని దర్శకనిర్మాతలకు తెచ్చిపెడుతుంది. ఇక అభిమానుల్లో కూడా మల్టీస్టారర్ సినిమాలంటే ఓ స్పెషల్ అభిమానం కూడా. అందుకే శాటిలైట్, డిజిటల్ హక్కులు కోసం క్రేజీ ఆఫర్స్ వరిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ బారీ బడ్జెట్ సినిమా రాబోతుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారాయి. రామ్ చరణ్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మగధీర సినిమా మైలురాయిగా నిలిచింది. అలాగే టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రబాస్ కెరీర్ లో బాహుబలి అలాంటి స్థానాన్నే సంపాదించుకుంది. ఇక ఇప్పుడు మగధీర, బాహుబలి కలిస్తే సినీ ప్రేమికులకు పండగే. దాంతోపాటు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కలెక్షన్లకు, రికార్డులు క్రియేట్ చేసే స్థాయి మించిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతుందని వార్తలు వస్తున్నాయి. సాహో సినిమా తర్వాత యూవీ బ్యానర్స్ అన్నీ పాన్ ఇండియా సినిమాలనే ప్లాన్ చేయాలని చూస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫిల్మ్ టీమ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక రామ్ చరణ్, ప్రభాస్ లు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.