ఫిజియోథెరపిస్టుతో ప్రభుదేవా పెళ్లిని ధృవీకరించిన బ్రదర్

కొరియోగ్రాఫర్.. దర్శకనిర్మాత కం నటుడు ప్రభుదేవా రెండో వివాహం ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్. కొన్ని వారాలుగా ప్రభుదేవా వివాహంపై నెటజనుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మొదటి వివాహం రామలతతో జరిగింది. ఈ జంటకు ఇద్దరు వారసులు ఉన్నారు. అనంతరం సహనటి నయనతార ను ప్రేమించి పెళ్లాడేందుకు ప్రభుదేవా సిద్ధమైనా రకరకాల కారణాలతో అది వీలు పడని సంగతి తెలిసినదే. 47ఏళ్ల ప్రభుదేవా అతని మొదటి భార్య నుండి ఆ తర్వాత అధికారికంగా 2011లో విడిపోయారు.

ఇప్పుడు మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తొమ్మిది సంవత్సరాల తరువాత ప్రభుదేవా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తొలుత ఆయన తన మేనకోడలినే పెళ్లాడారని ప్రచారం సాగింది. కానీ .. తనకు సేవలు చేసిన ఓ ఫిజియో థెరపిస్టును ప్రభుదేవా పెళ్లాడారు.

ఈ ఏడాది ప్రారంభంలో మేలో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకలో అతను తన భార్యతో కలసిపోయాడని ప్రచారమైనా అందులో వాస్తవం లేదని తేలింది. ప్రభుదేవా ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా ఫిజియోథెరపిస్ట్ కం డాక్టర్ హిమానిని వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇద్దరూ చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ విషయం ఇంతకుముందు నిప్పు లేని పొగలా స్ప్రెడ్ అయ్యింది. తాజాగా ప్రభుదేవా సోదరుడు ఈ పెళ్లిని అధికారికంగా ధృవీకరించారు.

ఫిజియోథెరపిస్ట్ కొన్ని నెలల క్రితం వెన్నునొప్పికి ప్రభుదేవాకు చికిత్స చేస్తున్నాడు. వారు కొంతకాలం ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకున్నారు. నూతన వధూవరులు ఇప్పుడు చెన్నైలో కలిసి నివసిస్తున్నారు.

తన మొదటి వివాహం నుండి ప్రభుదేవాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈ జంట 2008 లో తమ పెద్ద కుమారుడు బ్రెయిన్ క్యాన్సర్ తో చనిపోయాడు.

కెరీర్ గురించి ప్రస్థావిస్తే.. ప్రభుదేవా `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ కథానాయకుడు. ఈ భారీ యాక్షన్ చిత్రం 2009 బ్లాక్ బస్టర్ వాంటెడ్ కి సీక్వెల్. రాధే 2020 మే 22 న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. తాజా నివేదికల ప్రకారం ఈద్ 2021 కి విడుదల కానుందని ప్రకటించనున్నారని తెలుస్తోంది.