పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కామెంట్స్!

Prakash Raj strong comments on Pawan Kalyan politics

 

టాలీవుడ్ ప్రముఖ హీరో ప్రకాష్ రాజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య ఓ టఫ్ వార్ నడుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ ఊసరవెల్లి అని కామెంట్ చేశారు. అభిమానులు, కార్యకర్తలకు బీజేపీకి ఓటెయ్యాలని చెబితుంటే ఇక జనసేన పార్టీ ఎందుకు అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి వకీల్ సాబ్ సినిమాలో కనిపించారు. లేటెస్ట్ గా మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ లు ఒక్కటయ్యారు. అయితే కూడా ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ పై పాజిటివ్ కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ చాలా మారాడని, అతనంటే నాకు ఇష్టం అని, జనం మెచ్చిన లీడర్ అంటే అది పవన్ కళ్యాణ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. అలాగే ఆయన నిర్ణయాలు నచ్చకపోతే చెబుతానంటూ.. పవన్ ను తాను ఎప్పటికీ ద్వేషించడం జరగదని అన్నారు. ఇద్దరి మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒకర్ని ఒకరు అర్థం చేసుకుంటూ.. మాట్లాడే హక్కు కోసం ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటామని అన్నారు. పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి అయ్యాడని.. తాను నిజాయితీగా ఉన్నాడు కనుక వారి మధ్య ఎలాంటి సమస్య లేదని ప్రకాష్ రాజ్ అన్నారు.

అలాగే తమిళ రాజకీయాల్లో రజనీకాంత్, కమల్ హాసన్ లతో కలిసి పనిచేయకపోవడానికి కారణం కూడా తెలిపారు ప్రకాష్ రాజ్. ఎంజీఆర్, జయలలితలు పద్దతిగా పనిచేశారని. పొలిటికల్ ఇన్నింగ్స్ లో కూడా వాళ్ళకు ప్రత్యేకంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని, తన సిద్దాంతాలు తనకు ముఖ్యం అని అన్నారు. నిజానికి పొలిటికల్ అంటే వ్యక్తిగతం కాదని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి తానెప్పటికీ వ్యతిరేకం కాదని అన్నారు. సిద్దాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నా.. రజనీకాంత్ కాన్సెప్ట్ కూడా తనకు నమ్మకంగా అనిపించలేదని, అందుకే వారికి సపోర్ట్ చేయడం లేదని అన్నారు.