ప్ర‌శాంత్ నీల్ – ఎన్టీఆర్ నీల్ సినిమాపై ప్రముఖ నిర్మాణ సంస్థ క్లారిటీ

Prashant Neil - Leading production company Clarity NTR movie
Prashant Neil – Leading production company Clarity NTR mov

ఎన్టీఆర్-కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంభినేష‌న్ లో సినిమా ఉంటుంద‌న్న ప్ర‌చారం చాలా కాలంగా జరుగుతుంది .అయితే కేజీఎఫ్ తో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్ ను క‌లిశాడ‌ని ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్ర‌భాస్ తో స‌లార్ మూవీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ప్ర‌శాంత్ నీల్. మూవీ షూట్ కూడా మొదలు అయ్యింది. దీంతో ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందా లేదా …? అన్న ప్రశ్న తెర‌పైకి వ‌చ్చింది.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజమౌళి డైరేక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నుండి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం…
ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని తెలిపారు. ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ మూవీ పూర్త‌య్యాక‌, ప్ర‌శాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న స‌లార్ పూర్త‌య్యాక‌, ఈ మూవీ ప‌ట్టాలెక్కుతుంద‌ని చెప్పారు.