ఆర్ఆర్ఆర్ 2022 ఉగాదికి రిలీజ్ అవుతుందా?

సినిమా ప్రపంచంలో రాజమౌళికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన దగ్గర్నుండి విడుదలయ్యే సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. అంతేనా ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే చాలనుకునే హీరోహీరోయిన్లు ఉంటారు. రీసెంట్ గా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా కారణంగా ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి. అందులోనూ థియేటర్లు ఒపెన్ కాకపోవడంతో సినిమా షూటింగ్ లు కూడా నిదానంగా సాగుతున్నాయి.

భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసే సినిమాలు ఎక్కడా తగ్గకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. లేటెస్ట్ సమాచారం ప్రకారం 2022 ఉగాదికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించిన మరికొన్ని ప్రమోషన్ పనులు మిగిలి ఉండటం వల్లే ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసినట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.