రామ్ చరణ్, శంకర్ ల సినిమా షూటింగ్ షురూ

Ram Charan and Shankar's film shooting has started

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఈ పోస్టర్స్ లో నటీనటులతో పాటుగా టెక్నీషియన్స్ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసి శంకర్ క్రియేటివిటీని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ని ఈరోజు నుండి స్టార్ట్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఖరారు చేశారు.

ఈ సినిమా కోసం శంకర్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా సింపుల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు కోలీవుడ్ లో పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరెక్టర్ శంకర్ తో కలిసి మూవీ చేయాలని ఎంతోమంది ఆర్టిస్టులు కోరుకుంటారు. అలాంటి వ్యక్తి డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్నందుకు మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ తన సినిమాలతో, ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ సందర్భంగా RC 15 సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కావడంతో మెగా ఫ్యాన్స్ నెట్టింట్లో తన ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు.