రామ్ చరణ్, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్..

తెలుగు సినిమాల్లో పెద్ద హీరోలతో సినిమా చేయడానికి దర్శకులు సిద్ధంగా ఉన్నా.. హీరోలు మాత్రం సినిమా చేయడానికి అటు కమర్షియల్ యాక్ట్ తో పాటు, ఇటు అద్దిరిపోయే కథ కూడా ఉండాలని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ ఇంకాస్త ఎక్కువయ్యింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సరైన కథ సెట్ కావడం లేదట. రాజమౌళీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఇకపై రామ్ చరణ్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే కావాలని కష్టపడుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ దర్శకధీరుడు శంకర్ తో RC15 పేరుతో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తప్పకుండా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ తర్వాత రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా ఏంటి అనే విషయంపై క్లారిటీ లేదు. మరోవైపు మైత్రీ మూవీమేకర్స్, గీతా ఆర్ట్స్ తో డీలింగ్ ఉంది. అలాగే ప్రభాస్ సన్నిహితుల బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో కూడా ఓ సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ బ్యానర్ లో కథ ఓకే అయితే ఖచ్చితంగా ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుంది అంటున్నారు సినీ వర్గాలు. ఇక ఈ సినిమాకు సుజిత్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారని సమాచారం. గతంలో సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో అనుకున్నంత హిట్ ని సాధించలేకపోయారు. మరి ఈసారి రామ్ చరణ్ తో హిట్ కొడతారో లేదో చూడాలి.