తన గతాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకున్న నటి రోజా

Roja Latest News

 

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ రోజా. ఒకప్పుడు రోజా అంటే అల్టిమేట్ క్రేజ్ ఉండేది. ఆమె నవ్వుకి ఫిదా అవ్వని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి లేదు. టాప్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా చేసే నటన, డాన్స్, స్టైల్ లో ఆమెకు ఆమె సాటి. తన డాన్స్ గ్రేస్ తో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. టాప్ మోస్ట్ హీరోయిన్ల లిస్ట్ లో ఒకరిగా ఉండేవారు హీరోయిన్ రోజా. ఆ తర్వాత లేటెస్ట్ గా జబర్థస్త్ రోజాగా సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ కామెడీ షోలో కూడా తన ఎనర్జీని ఏమాత్రం తీసిపోకుండా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. అనసూయ, రేష్మీలతో కలిసి డాన్స్ లో అద్దరగొడుతుంది. దీంతో పాటు రియాలిటీ షోస్ కి కూడా హోస్ట్ గా చేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా స్థిరపడ్డారు. అటు పాలిటిక్స్ లో కూడా తన మార్క్ తో దూసుకుపోతున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ తగ్గేదె లే అంటూ కొనసాగుతున్నారు. రీసెంట్ గా ప్రముఖ టీవీ ఛానెల్ లో వినాయకచవితి స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇందులో రోజా తన లైఫ్ లో కొన్ని మెమరీస్ ని గుర్తు చేసుకున్నారు.

రోజా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 1991 లో వచ్చారు. అయితే తాను ఎంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగినా.. 2002 వరకు అప్పులు కడుతూనే ఉన్నారు. పెళ్ళికి ముందు కూడా తనకు పిల్లలు పుట్టరని అన్నారు. కానీ పెళ్ళైన ఏడాదికి పాప పుట్టిందట. అలా కన్నీరు పెట్టుకున్నారు రోజా. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాల సమయం ఖచ్చితంగా ఉంటుందని దాన్ని తట్టుకుని నిలబడటమే నిజమైన జీవితం అన్నారు రోజా.