వినాయక చవితికి ఆర్ఆర్ఆర్ నుండి ఎలాంటి అప్డేట్ లేదా?

RRR Movie Latest News

 

టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళీ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. చరిత్ర పుటల్లో కనివినీ ఎరుగని వ్యక్తులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లు కలిసి యుద్ధానికి సై అంటే ఎలా ఉంటుందోననే నేపథ్యంలో తీసిన సినిమా ఇది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, ఫస్ట్ లుక్ విశేషంగా ఆదరణ లభించింది. కొద్ది రోజుల క్రితం ది రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్. ఈ సినిమాలో ప్రతి సీన్ ఎంతో వైవిధ్యభరితంగా తీర్చిదిద్దినట్లుగా ఉంది.

ఫ్రెండ్షిప్ డే కోసం దోస్తీ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను యంగ్ టైగర్ మీద పెట్టిన జక్కన్న త్వరలో ఎన్టీఆర్ హోస్ట్ చేయబోయే ఎవరు మీలో కోటీశ్వరుడు కి రాబోతున్నట్లు సమాచారం. వినాయక చవితికి స్పెషల్ అప్డేట్ కోసం ఆర్ఆర్ఆర్ నుండి కూడా ఏదొక అప్డేట్ ఇస్తారని ఎదురుచూసిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైనట్లు తెలుస్తుంది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఏమో జక్కన్న సడెన్ సర్ ప్రైజ్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసాడేమో చూడాలి.