‘మా’ ఎలక్షన్స్ పై అజయ్ భూపతి సెన్సేషనల్ ట్వీట్!

RX-100 Director Ajay Bhupathi Shocking Tweet on Maa Elections

 

టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో రోజుకో టాపిక్ తో ఆసక్తికరంగా ఉంటోంది. సినిమా ఆర్టిస్టుల అధ్యక్ష పదవి ఎన్నికలు ప్రస్తుతం రాజకీయ ఎన్నికలుగా మారాయి. పోటాపోటీగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఈ ఎన్నికలు జరుగుతాయన్న క్రమంలో ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు మా ఎన్నికల్లో సంచలనంగా మారింది. నాకు నచ్చిన పానెల్ కు మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్స్ రాస్తానంటూ నాతో ఇప్పుడే ఓ డైరెక్టర్ అన్నారని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి మా ఎలక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో మా ఎలక్షన్స్ లో బ్లాక్ మెయిలింగ్ ను కూడా ప్రయోగిస్తున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు ఒకర్నొకరు దూషించుకుంటూ పర్సనల్ విషయాలపై కూడా మండి పడుతున్నారు. అలాగే మా ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారాలు కూడా సాగుతున్నాయంటూ కొంతమంది ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇలాంటి క్రమంలో అజయ్ భూపతి చేసిన ట్వీట్ తెగ ట్రెండ్ అవుతుంది.