అక్టోబర్ 1 న రిపబ్లిక్ బజ్.. ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్..

Republic movie Buzz on October 1st Special craze in the audience

 

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా కాంబినేషన్ లో వస్తున్న సినిమా రిపబ్లిక్. ఈ సినిమాలో ఐశ్యర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి స్పెషల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా హైప్ పెరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేశారు. కానీ యాక్సిడెంట్ కారణంగా సాయి తేజ్ ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారు. కానీ తన మేనమామల సపోర్ట్ తో ఈ సినిమాపై క్రేజీ బజ్ ను క్రియేట్ చేశారు. సినిమా ప్రమోషన్స్ బాధ్యతను కూడా వాళ్ళే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ గురించి మాట్లాడి మరింత ఆసక్తిని పెంచారు.

రిపబ్లిక్ సినిమా అంశం గురించి, కథ గురించి చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ కి సోషల్ మీడియాలో అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభుత్వం అధికారిగా సాయి ధరమ్ తేజ్ ఓ పొలిటికల్ లీడర్ ను ఎలా ఎదిరించారనే నేపథ్యంలో తెరెకెక్కిన కథాంశం. అలాగే రమ్య కృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించారు. దేవ కట్టా దర్శకత్వం కూడా అద్భుతంగా తెరకెక్కింది. అందులోనూ ప్రస్తుతం సమాజం ఏ విధంగా ఉందో.. పరిస్థితులు ఎలాంటి అగచాట్లను ఎదుర్కుంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించడం విశేషం. అక్టోబర్ 1 న రిలీజ్ అయ్యే ఈ సినిమాకి ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది.