శ్రీకాకుళం : సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. శ్రీకాకుళం బాపూజీ కళా మందిర్ లో సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ప్రముఖులంతా హాజరయ్యారు. అచ్చెన్నాయుడు వేదిక మీదికి వచ్చారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో ప్రక్కనే కూర్చోబోయారు. ఇంతలో సోఫా విరిగిపోవటంతో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులు వేదికపై పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వారిని పైకి లేపి మరో కుర్చీ ఏర్పాటు చేశారు…