
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. అయితే తెలంగాణలో రాజేంద్రనగర్ బుద్వేల్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కె.ఎస్. దయానంద్(డేవిడ్) తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామా లేఖను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ కు, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డికి ఇచ్చినట్టుగా తెలిపినారు.
కె.ఎస్. దయానంద్ రాజీనామా అనంతరం తన అనుచరులతో కలిసి లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిసినారు. అయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుండడం శుభ సూచికం అంతే కాకా ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీకి తాము మద్దతిస్తున్నట్టు కె.ఎస్. దయానంద్ మీడియా ముందు ప్రకటించారు.