బిగ్ బాస్ స్టార్ట్ అయిన 50 రోజులకు గేమ్ షురూ చేసిన షణ్ముఖ్!!

Shanmukh started the game 50 days after the start of Bigg Boss,

 

బిగ్ బాస్ హౌస్ లో 50 రోజులు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో సిరి, షణ్నులు విశ్వ గురించి మాట్లాడుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. నెక్ట్స్ ప్రియాంక, శ్రీరామ్ ను పెద్దబావ, మానస్ చిన్నబావ, జెస్సీ బుల్లి బావ అంటూ రవికి చెప్పి తెగ సిగ్గుపడుతుంది. అలాగే లోబోని అన్నయ్య అంటుంది. రవి, షణ్ముఖ్ ల మధ్య టాస్కులు ఆడటం మీద ఇంట్రెస్టింగ్ సీన్ సాగింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని ప్రారంభించారు.

బిగ్ బాస్ హౌస్ మొత్తం లాక్ డౌన్ లో ఉంటుందని.. హౌస్ మేట్స్ అంతా గార్డెన్ ఏరియాలో ఉంటారని అన్నారు. ఇంట్లోకి వెళ్ళాలంటే కెప్టెన్సీ పోటీదారులు ఐదు డిఫరెంట్ ఛాలెంజ్ లను ఆడి గెలవాలని అన్నారు. ఫస్ట్ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళు సెకండ్ గేమ్ లో ఆడే అవకాశం ఉంటుందని అన్నారు. ఫస్ట్ షన్ను, లోబోలు పార్టిసిపేట్ చేశారు.

పేడలో కలిసిన ముత్యాల్ని వెతికి పట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ ముత్యాల్ని తీస్తారో వాళ్ళే విన్నర్ అంటాడు. అలాగే వెతికిన ముత్యాల్ని నీళ్ళల్లో కడిగి వేయాలి. ఈ టాస్క్ లో షణ్ముఖ్, లోబో కన్నా ఎక్కువగా తీసాడు. కానీ అవి శుభ్రంగా లేవు. అయితే ఎక్కువ తీసిన వారే విన్నర్ అంటూ సిరి, షణ్ను కి సపోర్ట్ చేస్తుంది. సంచాలకునిగా వ్యవహరిస్తున్న సన్నీ, షణ్ముక్ నే విన్నర్ గా ప్రకటించారు. నెక్ట్స్ హౌస్ మేట్స్ అంతా మాట్లాడుకుంటూ ఉండగా.. లోబో వాళ్ళ మధ్యలో నుండి పెద్దగా అరుచుకుంటూ.. వెనక్కి తిరిగి బాంబ్ లు వదులుతూ పిచ్చి కామెడీ చేశారు. లోబో బాంబుల దెబ్బకి హౌస్ మేట్స్ అంతా పరుగులు పెట్టారు.

నెక్ట్స్ టాస్క్ లో రవి, సిరిలు పార్టిసిపేట్ చేయడా.. స్విమ్మింగ్ పూల్ లో బాటిల్స్ ని గాలం వేసి ఒడ్డున పెట్టాలి. అలా ఎవరైతే ఎక్కువ బాటిల్స్ తీసి ఒడ్డుకు చేరుస్తారో వారే విన్నర్. సిరి, రవి కన్నా ఎక్కువ బాటిల్స్ తీసి సర్ ప్రైజ్ చేసింది. నెక్ట్స్ శ్రీరామ్, మానస్ లు పోటీ పడ్డారు. రోప్ ని ఆపకుండా మూవ్ చేయాలని ఎవరైతే ఎక్కువసేపు అలా రోప్ చేస్తూ ఉంటారో వారే విన్నర్. ఈ టాస్క్ లో శ్రీరామ్ విన్ అయ్యారు. అలాగే ఈ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల్లో షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ లు విన్నర్స్ గా నిలిచి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.