ఛార్టర్డ్ అకౌంటెంట్ చూపు.. టీడీపీ వైపు

 Show as the spokesperson of the Congress party towards the TDP

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ జి.వెంకటరెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన గొలమారి వెంకటరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ గా గుర్తింపు పొందారు. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వెంకటరెడ్డి… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు ఇరుకున పెట్టేలా ఆరోపణలు చేస్తున్నారు. అధికార ప్రతినిధి హోదాలో టీవీ డిబేట్ లలో కూడా తన వాణి బలంగా వినిపిస్తున్నారు. గొలమారి వెంకటరెడ్డి ఇప్పటికే చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వెంకటరెడ్డిని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉంది.