బిగ్ బాస్ నుండి శ్వేతా వర్మ ఎలిమినేషన్

Shweta Varma Elimination from Bigg Boss

 

బిగ్ బాస్ సీజన్ 5 లో వీకెండ్ ఫన్ తో ఎంటర్ టైన్ చేయడానికి నాగార్జున రెడీ అయ్యారు. లోబోని సీక్రెట్ రూమ్ కి పంపిన తర్వాత ఇంటి సభ్యుల్లో టెన్షన్ నెలకొందని వారి మూడ్ ని మార్చడానికి రెండు టీమ్స్ కి విడదీసి గేమ్స్ ఆడించారు. సాంగ్స్ ని గెస్ చేసే గేమ్ తో హౌస్ మేట్స్ విన్యాశాలు చేశారు. టీమ్ ఎ తమ టాలెంట్ తో అందర్ని ఆకట్టుకున్నారు. ఫాస్ట్ గా సాంగ్స్ ని గెస్ చేయడంలో కాజల్ పేరు మార్మోగిపోయింది.

గేమ్ కంప్లీట్ అయ్యేసరికి హౌస్ లో నలుగురు కుటుంబ సభ్యులు సేఫ్ అయ్యారు. టెడ్డి బొమ్మలతో షన్ను, ప్రియాంకల్ని సేవ్ చేశారు. షణ్ను సేవ్ అనగానే సిరి ఫేస్ వెలిగిపోయింది. నెక్ట్స్ పిగ్గీ బ్యాంక్స్ ని బ్రేక్ చేయడంతో శ్రీరామ్, సన్నీలు సేఫ్ అయ్యారు. నెక్ట్స్ హౌస్ మేట్స్ తో నాగార్జున కళ్ళకు గంతలు కట్టించి, మిగిలిన వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉండాలి. అక్కడ పెట్టిన బోన్ ని కనిపెట్టి పట్టుకోవాలి. ఇందులో కూడా టీమ్ ఎ ఎంతో ఫాస్ట్ గా తెలివిగా ఆడి గెలుచేకున్నారు. నెక్ట్స్ సిరి, షణ్ను, జెస్సీ, ప్రియాంకల ఆటతో టీమ్ ఎ ఫస్ట్ నిలిచింది. ఈ గేమ్ మధ్యలోనే మరో ఇద్దర్ని సేఫ్ చేశారు. ఈసారి విశ్వ, రవిలు సేఫ్ అయ్యారు. నెక్ట్స్ సిరి, జెస్సీ, శ్వేతాల్లో జెస్సీని సేఫ్ అయినట్లు అనౌన్స్ చేశారు.

సిరిని, శ్వేతా వర్మని గార్డెన్ ఏరియాకి పిలిచి అక్కడ ఓ డబ్బాని బ్రేక్ చేయాలని చెప్పారు. అందులో ఉన్న మరో బాక్స్ ని లివింగ్ ఏరియాకి తీసుకునివచ్చారు. ఆ బాక్స్ లో సిరి పేరు ఉండటంతో ఆమె ఆనందానికి అవదులు లేదు. ఇంకేం షణ్ను, జెస్సీలు వచ్చి సిరి హగ్ చేసుకున్నారు. ఫైనల్ గా ఈ వీక్ శ్వేతా వర్మ ఎలిమినేట్ అవ్వడంతో అమ్మ అంటూ పిలిచే అనీ మాస్టర్ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత శ్వేతా వర్మ, నాగార్జున దగ్గరకు వచ్చాక కొన్ని బోర్డ్స్ పెట్టి హౌస్ మేట్స్ ఎవరు ఏ బోర్డ్ కి సూట్ అవుతారోనని చెప్పమన్నారు. అందరికి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తుంది శ్వేతా.