హరీష్ గేమ్ ప్లాన్ కు పడిపోయి పట్టం కడతారో చూడాలి

siddipeta-municipal-election-minister-harish-rao-new-strategy
siddipeta-municipal-election-minister-harish-rao-new-strategy

తెలంగాణ సిద్దిపేటలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో మంత్రి హరీష్ రావు ఎత్తుగడలు వేస్తున్నారు. కానీ అవి ఫలించే వరకు ఎవరికీ అర్థం కావు.. హరీష్ రావు పక్కా వ్యూహంతో ప్రత్యర్ధులకు దొరకకుండా ఎత్తులు వేస్తున్నారు.

సిద్దిపేట మున్సిపాలిటీలో ఏకగ్రీవాలు పోను మిగిలిన వార్డుల్లో టీఆరెస్ పార్టీ కి చాలా సార్లు చుక్కెదురైంది. బీజేపీ, ఇతర పార్టీలు గత మున్సిపల్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు వచ్చినాయి. దింతో మంత్రి హరీష్ రావు నైతికంగా ఓడినట్లే అన్న మాటలు వచ్చాయి. అయితే ప్రత్యర్ధులకు ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పటి నుండే తనదైన ప్లాన్ వేసినట్లు విశ్లేషకులు అంటునారు.

సిద్దిపేటలో యువకులే బీజేపీ బలం.. ఒకప్పుడు టీఆరెస్ కు బలమైన ఓటు బ్యాంకు వారే.. ఓటు కోసం యువతను డబ్బుతోనో, మందుతోనో తమ వైపుకు తిప్పుకోలేరు. వారిని హరీష్ రావు టీఆరెస్ వైపుకు తిప్పుకొనేందుకు వాలీ బాల్, క్రికెట్ టోర్నీలు జరుపుతున్నారు. హరీష్ రావు ఆటలను ప్రోత్సహిస్తాం అంటూ గతంలో లేనివిధంగా ఎక్కువ సమయం వారికే కేటాయిస్తున్నారు. అయన స్వయంగా మ్యాచులకు అటెండ్ కావటం, తను కూడా ఆడుతూ యువకులతో కలిసిపోవడం చూస్తుంటే…. మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటి నుండే స్కెచ్ వేసినట్లు విశ్లేషకులు చెప్తున్నారు.