అమెరికాను వ‌ణికిస్తున్న మంచు తుఫాన్

snow strom in several states in america
snow strom in several states in america

అమెరికాపై మంచు తుఫాన్ విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని పలు రాష్ట్రాలు మంచు తుఫాన్ తో అల్లాడుతున్నాయి. అమెరికా దక్షిణాది, మధ్య రాష్ట్రాలు తీవ్ర మంచు తుఫాన్ ప్రభావంతో వణికిపోతున్నాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో చాలా మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు.

టెక్సాస్‌ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రాష్ట్రం మొత్తాన్ని మంచు క‌ప్పేసింది. విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల అధికారులు ప‌వ‌ర్ ఎమ‌ర్జెన్సీ విధించారు. టెక్సాస్‌ రాష్ట్ర వ్యాప్తంగా మంచు తుఫాన్ ప్రభావం ఉన్నందున ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించారు.
ఇప్ప‌టికే వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోగా, విమానాలు కూడా ర‌ద్ద‌వుతున్నాయి.

మ‌రోవైపు శీత‌ల గాలులు ప్రభావం ఎక్కువగా ఉండటంతో… ప్రజలను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. అక్కడ రోడ్లన్నీ ప్ర‌మాద‌క‌రంగా మారిపోయాయి. టెక్సాస్‌తో పాటు మిస్సిస్సిప్పీ, కెంటుకీ, ఒరెగాన్, అలబామా, ఓక్లహోమా రాష్ట్రాలు మంచులోనే ఉండిపోయాయి. అలాగే హూస్టన్‌ , డల్లాస్ నగరాల ల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది.