మొలకెత్తిన పెసలు తినే అలవాటుందా? మరి వాటి ఉపయోగాలు తెలుసుకోండి..

sprouted mung bean health benefits

 

ఇప్పుడు చాలామంది మెనూలో స్ప్రౌట్స్ కామన్ గా మారిపోయాయి. హెల్త్ మీద అవేర్ నెస్ తో కొందరు, డాక్టర్ సలహాతో మరికొందరు మొలకలను రోజూ తింటున్నారు. అయితే మొలకెత్తిన పెసలు తింటే ఎన్ని ఉపయోగాలున్నాయో, ఏ రోగాలకు చెక్ పెట్టొచ్చో చాలామందికి తెలీదు.

మొలకెత్తిన పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఈ పెసర మొలకలను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తిని పెరుగుతుంది. మన శరీరానికి ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పెసలలో అధికభాగం ఫైబర్ ఉండటం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ రేటు మెరుగుపరుస్తుంది.

మొలకెత్తిన పెసలు తింటే ఏఏ ఉపయోగాలున్నాయి?..

మధుమేహాన్ని నియంత్రిస్తాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మొలకెత్తిన పెసలు చాలా మంచివి. వీటిని సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయగల సామర్థ్యం వీటికి ఉంది.

గుండె జబ్బుల నుంచి రక్షణ..

గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండాలంటే మొలకెత్తిన పెసలు చాలా ముఖ్యం. ప్రతిరోజు గుప్పెడు పెసలను తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

సంతానోత్పత్తికి..

వివాహితులు మొలకెత్తిన పెసర్లను తింటే సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. శరీర లోపలి భాగాలను శక్తివంతం చేస్తుంది.

గర్భిణీలకు ఉపయోగపడే ఫోలేట్‌..

మొలకెత్తిన పెసలు గర్భిణీలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో మహిళల శరీరానికి ఫోలేట్ అవసరం. ఇది తల్లి కడుపు లోపల బిడ్డను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి..

మొలకెత్తిన పెసలు బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది. ఎక్కువ సమయం ఆకలి లేకుండా చూస్తుంది. వీటిని తినడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తినలేము. దీంతో బరువును అదుపులో ఉంచుకోవచ్చు. నానబెట్టిన పెసలను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గానూ, సాయంత్రం స్నాక్స్ టైమ్ లోనూ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.