రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్ స్పెషల్ గెటప్..

Srikanth in Ramcharan Pan India Movie

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ సినిమా కోసం ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి అల్టిమేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సినిమా హీరోహీరోయిన్లు, డైరెక్టర్, సినిమా ప్రొడ్యూసర్, మిగతా ఆర్టిస్టుల ఫోటోలతో డిజైన్ చేశారు. ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్ 50 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ పోస్టర్ కి సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దిల్ రాజు సైతం ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సిద్ధం అయ్యారు.

ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ నటిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో భాగంగా శ్రీకాంత్ ఈ సినిమా విశేషాలను కూడా షేర్ చేసుకున్నారు. అఖండ సినిమాలో 40 గెటప్స్ లో ఒక్క గెటప్ ని సెలెక్ట్ చేశారట. అలాగే శంకర్ సినిమాలో పాత్ర మీద కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ సినిమాలో శ్రీకాంత్ కి రెండు గెటప్స్ ని ఫిక్స్ చేశారు. ఓల్డ్ లుక్ లో ఒకటి.. మరొకటి యంగ్ లుక్ లో ఉండబోతుందని శ్రీకాంత్ అన్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ది చాలా వినూత్నమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.