బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం వరస్ట్ పర్ఫార్మెర్ గా సన్నీ..

Sunny as Worst Performer this week at Bigg Boss House

 

బిగ్ బాస్ హౌస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో సన్నీకి, ఇంట్లో సభ్యులకు మధ్య గొడవ జరుగుతుంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జెస్సీ సంచాలకునిగా వ్యవహరించడంలో ఫెయిల్ అయ్యాడంటూ మానస్ తో సన్నీ అంటాడు. నెక్ట్స్ మాసస్, బిగ్ బాస్ టాస్క్ ఆడే ప్రాసెస్ ను వివరిస్తూ ఓ పేపర్ లో రాసి ఉన్నదాన్ని చదివి వినిపించారు. ఫస్ట్ రౌండ్ లో సర్కిల్ చుట్టూ నడవాలి. నెక్ట్స్ రౌండ్ లో సెకండ్ సర్కిల్ లో నడవాలి. అలాగే ఫైనల్ రౌండ్ లో చివరి సర్కిల్ లో నడవాలి. అలా మొత్తం ఐదు రౌండ్స్ లో ఆరుగురు పోటీదారులు పార్టిసిపేట్ చేస్తారు. రవి గేమ్ ప్లాన్ ని మార్చేయడం, షణ్ముఖ్ తో దూరంగా ఉండకుండా వారి గ్రూప్ తో కలిసిపోయాడు. అనీ మాస్టర్, శ్రీరామ్, జెస్సీలతో కూర్చుని సంచాలకునిగా గ్రేట్ జాబ్ అంటుంది. అలాగే సన్నీ గురించి టాపిక్ వచ్చి అరిస్తే.. హీరోలు అయిపోరంటుంది. నెక్ట్స్ కాజల్, మానస్, సన్నీలు ఒక చోట కూర్చుని, ఈ ఇంట్లో ఒకే ఒకరు ఫేస్ కి మాస్క్ వేసుకుని ఉంటాడని అంటుంది కాజల్.

ఈ క్రమంలో ఈ ఇంట్లో నెగ్గురావలంటేనే ఇరిటేటింగ్ గా ఉందని అంటాడు సన్నీ.. ఉదయాన్ని కాజల్ దగ్గర కూర్చుని షణ్ముఖ్ కంటే అనీ మాస్టర్ బ్యాగ్ లోనే బాల్స్ ఎక్కువగా ఉన్నాయని అంటాడు సన్నీ. కానీ అవేమి ఆలోచించకుండా షణ్నుని కెప్టెన్ ని చేశారంటూ ఓ పాట పాడతారు. కెప్టెన్ అయిన తర్వాత కూడా షణ్ముఖ్ ఎలాంటి మార్పు లేదు. కొంచెం కూడా బాధ్యత లేకుండా అదే మోజ్ రూమ్ లో కూర్చుని సిరితో కబుర్లు చెబుతున్నాడు. నెక్ట్స్ హౌస్ లో ఎవరు వరస్ట్ పర్ఫార్మెర్ అనే టాపిక్ తో కాజల్ ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మెర్ అని షణ్ముఖ్ తన అభిప్రాయం చెబుతాడు. నెక్ట్స్ సన్నీ, జెస్సీ పేరు, లోబో అనీ మాస్టర్ పేరు చెబుతారు. రవి, సన్నీని వరస్ట్ పర్ఫార్మర్ అని అంటాడు. ఫైనల్ గా ఇంటి సభ్యుల్లో అత్యధికంగా సన్నీకి, కాజల్ కి వరస్ట్ పర్ఫార్మెర్ గా మూడు ఓట్లు రావడంతో టై అవుతుంది. నెక్ట్స్ హౌస్ మేట్స్ అంతా కలిసి కెప్టెన్ షణ్ముఖ్ ని డెసిషన్ తీసుకోమంటారు. దీంతో సన్నీని వరస్ట్ పర్ఫార్మెర్ గా జైలుకు పంపుతారు.