సిరి ఓవరాక్షన్ ఆటిట్యూడ్ కి చెక్ పెట్టిన సన్నీ.. హర్ట్ అయిన షణ్ను

Sunny Vs Siri Bigg Boss 5 Telugu Latest Updates

 

బిగ్ బాస్ హౌస్ సీజన్ 5 లో ఆరవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బొమ్మల రచ్చ కంటిన్యూ అవుతుంది. సిరిపై గొడవకు దిగిన అనీ మాస్టర్ తో మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నా ఆట నేను ఆడతానంటూ తెగేసి చెప్పింది. ఈ టాస్క్ లో సంచాలకులుగా ఉన్న సిరి, కాజల్ లు వాళ్ళకేదో శక్తిమాన్ పవర్ వచ్చినట్లుగా ఫీలవుతున్నారు. సిరి అయితే తానే బిగ్ బాస్ అన్నట్లు అందరూ ఆమె చెప్పినట్లుగానే చేయాలన్నట్లు ఆటిట్యూడ్ చూపిస్తుంది. ఈ ఆటిట్యూడ్ తో ఇంటి సభ్యులే కాదు.. ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు.

రోజురోజుకి వీళ్ళు చేస్తున్న ఓవరాక్షన్ కి ఆ బిగ్ బాస్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారోనని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో రవి టీమ్ కి ఓ సూపర్ పవర్ బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ హెల్ప్ తో తమకు పోటీదారులుగా వ్యవహరిస్తున్న టీమ్ నుండి అన్ని బొమ్మల్ని తీసేసుకోవచ్చని తెలిపింది. దీంతో రవి టీమ్, బ్లూ టీమ్ అయిన మానస్, సన్నీ, అనీ మాస్టర్ ల దగ్గరున్న ఎక్కువ బొమ్మల్ని తీసేసుకుంటాడు. దీంతో ఈ టీమ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఆ తర్వాత సన్నీ, సిరిలకు ఆర్గ్యూమెంట్ ఎదురవుతుంది. తనను అందరి ముందు అన్నాడు కాబట్టి సన్నీ, అందరి ముందు సారీ చెప్పాలని గట్టిగా అంటుంది. దానికి సన్నీ రిప్లై ఇస్తూ.. నేను బరాబర్ చెప్పనని అంటాడు. దాంతో మూతి ముడుచుకున్న సిరికి, షణ్ను వచ్చి తన స్టైల్ లో ఓదారుస్తాడు. అలా లేటెస్ట్ ఎపిసోడ్ లో కూడా ఈ త్రీ ఇడియట్స్ ఓవరాక్షన్ ని భరించాల్సి వచ్చింది.