అగ్రరాజ్యం కీలక ప్రకటన

అగ్రరాజ్యం అమెరికా సోమవారం కొత్త అధ్య‌క్షుడు జో బైడెన్ అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌కు క‌రోనా వ్యాక్సిన్ ఇచ్చే నిర్ణ‌యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అక్రమ వలసదారుల ఇతర పౌరుల మాదిరిగానే వీరు కూడా వ్యాక్సినేష‌న్ కేంద్రాలలో వ్యాక్సిన్ వేయించుకోవచ్చని.. అమెరికాలో నివసించే వ్యక్తులందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలియచేసినారు. స్థానిక వ్యాక్సినేష‌న్ మార్గదర్శకాల ప్రకారం అర్హత ఉన్న వారందరికీ తప్పకుండా వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. అమెరికాలో ఇప్పటివరకు సుమారు 32.8ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ అందించారు.