నీట్ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. యథాతథంగా ఆదివారమే నీట్ పరీక్ష జరపాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(యూజీ)-2021 పరీక్షను వాయిదా వేయాలి లేదా రీషెడ్యూల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న నీట్ పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. అదే రోజున ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో పాటు సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని పిటిషనర్లు వాదించారు, అంతే కాకుండా పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలంటూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.