అమెజాన్ లో 4 సినిమాలు రిలీజ్ చేయబోతున్న సూర్య ..

కోలీవుడ్ సూపర్ హీరో సూర్య తన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. రియల్ స్టోరీని బేస్ చేసుకున్న సినిమా జై భీమ్. ఇక ఈ సినిమాని ప్రముఖ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో హీరో సూర్య అమెజాన్ ఓటీటీతో ఏకంగా నాలుగు సినిమాల్ని విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. కరోనా కారణంగా తామే మీ డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. జై భీమ్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నవంబర్ నెలలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. టి.ఎస్‌.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు.

ఇందులో సూర్య గిరిజనుల తరఫున పోరాడే న్యాయవాదిగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి సూర్య ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రజిషా విజయన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మణికందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయిగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఆకాశమే నీ హద్దురా సినిమా తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు సూర్య, జ్యోతికలు నిర్మించిన సినిమా ఓ మై డాగ్.. ఈ సినిమాని కూడా తెలుగు, తమిళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఉడన్ పిరప్పే, రామే రావనే సినిమాలను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ప్రతి నెలలో ఒక సినిమా స్ట్రీమ్ అవుతుందని సూర్య తెలిపారు.