పాకిస్థాన్ కాదు… పాపిస్థాన్…!

 Taliban Pakistan Latest News

 

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వివాదాస్పదమైన దేశం ఏదీ అంటే ఠక్కున చెప్పే సమాధానం పాకిస్థాన్. తాలిబాన్లకు పూర్తి మద్దతు ఇస్తూ… ఆఫ్గనిస్తాన్ లో రాక్షస పాలన తిరిగి మొదలయ్యేందుకు సహకరించిన దేశం పాకిస్థాన్. భారత్ కు దాయాది దేశంగా గుర్తింపు పొందిన పాకిస్థాన్ వైఖరి పట్ల ఐక్యరాజ్యసమితి మొదలు ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ని తప్పు పడుతున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పొరుగు దేశాలైన భారత్, బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్ పై తూర్పు దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల పరిపాలనకు భయపడి పరారైన ఎంతోమంది ఇప్పుడు పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ వైఖరితో క్రీడా సంబంధాలు కొనసాగించేందుకు కూడా మిత్ర దేశాలు సైతం విముఖత చూపుతున్నాయి. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు లాహోర్ చేరుకున్న న్యూజిలాండ్ క్రికెట్ టీం కనీసం హోటల్ రూం నుంచి బయటకు వచ్చేందుకు కూడా సుముఖత చూపలేదు. కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా బాల్ పడకుండానే సిరీస్ మొత్తం రద్దయింది.

ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా న్యూజిలాండ్ బాటలోనే నడిచేలా కనిపిస్తోంది. పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్ అంటే అమ్మబాబోయ్ అనేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. స్టేడియంలోకి ప్రేక్షకులను రాకుండానే కట్టడి చేస్తున్నప్పటికీ కీ ప్లేయర్స్ మాత్రం పాకిస్థాన్తో క్రికెట్ సిరీస్ అంటే మా వల్ల కాదు అనేస్తున్నారు. పాకిస్తాన్ వైఖరిలో మార్పు రాకపోతే కేవలం ఐసీసీ సిరీస్ లలో తప్ప.. మరే జట్టుతో కూడా క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి అత్యంత దయనీయంగా మారే అవకాశం ఉంది.