తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లాండ్ చేతిలో ఓటమి

Team India loses to England in the first Test
Team India loses to England in the first Test

చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. 227 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ టీం ఇండియా పై ఘన విజయం సాధించింది. ఐదో రోజు 39-1 ప‌రుగుల‌తో బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా ఏ ద‌శ‌లోనూ డ్రా దిశ‌గానూ, గెలుపు దిశ‌గానూ మ్యాచ్ సాగ‌లేదు. వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూ భారత్ చేదన లో 192ప‌రుగుల‌కే కుప్పకూలింది. స్పిన్న‌ర్ జాక్ లీచ్ 4 వికెట్లు తీసి భార‌త్ ను దెబ్బ‌తీశాడు. శుభ్ మన్ గిల్, కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది.