
మన దేశంలో డీజిల్, పెట్రోల్ రేట్లు రోజు రోజుకు పెరుగుతోనే వున్నాయి . కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ సెంచరీ దాటేసింది .. ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే వరుసలో ఉన్నాయి. అయితే డీజిల్ పెట్రో ధరల పెంపుతో సామాన్యుడు బెంబేలెత్తిపోతోంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చోద్యం చేస్తున్నాయి. డీజిల్ పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వసూలు చేస్తున్న పన్నులల్లో కనీసం ఒక్క శాతం కూడా తగ్గించడంలేదు.
ముఖ్యంగా పెట్రోల్ పై పన్నుల విషయం లో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అయితే మరి దారుణంగా ఉంది. మన దేశంలోనే పెట్రోల్‌పై ఎక్కువగా వ్యాట్ వసూలు చేస్తున్న మొదటి రాష్ట్రం రాజస్థాన్ కాగా, తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్‌పై అత్యధికంగా 36 శాతం పన్నులు వసూలు చేస్తుండగా, ఆ తర్వాత 35.2 శాతం వ్యాట్ ను తెలంగాణ వసూళ్లు చేస్తోంది.