గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటించింది. ఇటీవలే హత్యకు గురైన రమ్య ఇంటికి చేరుకున్న కమిషన్ సభ్యులు విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది, ఇదిలా ఉండగా రమ్య ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. పలువురు బీజేపీ నేలను అడ్డుకున్నారు.
బీజేపీ మహిళా నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా మహిళా నేతలు రోడ్డుపై బైఠాయించారు. కమిషన్ సభ్యుల వెంబడి వైసీపీ నేతల వాహనాలను పంపించి తమను అడ్డుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.